: పాక్ ను కష్టాల్లోకి నెట్టిన భారత స్పిన్నర్లు
ముగ్గురు స్పిన్నర్లతో బరిలో దిగాలన్న కెప్టెన్ ధోనీ ఎత్తుగడ సత్ఫలితాన్నిస్తోంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పాక్ జట్టును భారత స్పిన్నర్లు కష్టాల్లోకి నెట్టారు. పాక్ 10 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 50 పరుగులు చేసింది. కెప్టెన్ హఫీజ్ (15), ఓపెనర్లు షేజాద్ (22), కమ్రాన్ అక్మల్ (8) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. అక్మల్ రనౌట్ కాగా, జడేజా, మిశ్రా చెరో వికెట్ తీశారు.