: టాస్ గెలిచిన భారత్... ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి


చిరకాల ప్రత్యర్థితో పోరుకు భారత్ సిద్ధమైంది. బంగ్లాదేశ్ వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ మెయిన్ డ్రా ఆరంభ మ్యాచ్ లో దాయాదులు తలపడుతుండడంతో అందరి దృష్టి మ్యాచ్ పైనే కేంద్రీకృతమై ఉంది. మిర్పూర్ లోని షేర్-ఏ-బంగ్లా స్టేడియం ఆతిథ్యమిస్తోన్న ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా, పాక్ తో పోరు కోసం టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలో దిగుతోంది. ఆఫ్ స్పిన్నర్ అశ్విన్, లెఫ్టార్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా, లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రాలకు తుది జట్టులో చోటు కల్పించడం ద్వారా టీమిండియా వ్యూహకర్తలు వైవిధ్యానికి పెద్దపీట వేశారు.

  • Loading...

More Telugu News