: మోడీ, రాజ్ నాథ్ లపై అభ్యర్థులను బరిలో దింపడంలేదు: శివసేన


బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ లపై తమ అభ్యర్థులను బరిలో దింపడంలేదని శివసేన స్పష్టం చేసింది. అయితే, ఉత్తరప్రదేశ్ లోని ఇతర లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తామని తెలిపింది. మోడీ... యూపీలోని వారణాసి నుంచి, రాజ్ నాథ్ లక్నో నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, బీజేపీతో తమ పొత్తు మహారాష్ట్రకే పరిమితమని, యూపీకి కాదని శివసేన ప్రతినిధి సంజయ్ రౌత్ తెలిపారు. వారణాసి, లక్నో తప్ప యూపీలోని 20 స్థానాల్లో శివసేన అభ్యర్థులు బరిలో దిగుతారని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News