: అంతవరకు వస్తే నేను కూడా కఠిన నిర్ణయం తీసుకుంటా: మోదుగుల


గుంటూరు జిల్లా నరసారావుపేట పార్లమెంటు టికెట్ తనకే కేటాయిస్తారని టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. సిట్టింగ్ ఎంపీనైన తనకు ఇవ్వకుండా మరొకరికి టికెట్ కేటాయిస్తే... తాను కూడా కఠిన నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ఇదే స్థానం నుంచి మోదుగుల బావ అయిన అయోధ్య రామిరెడ్డి (రాంకీ గ్రూప్) వైకాపా తరపున పోటీ చేస్తుండటం... మోదుగులకు అడ్డంకిగా మారింది. అయితే బంధుత్వాల కారణంగా టికెట్ నిరాకరించడం మంచి పధ్ధతి కాదని ఆయన అన్నారు. బావపై పోటీకి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. అయితే, టీడీపీలో చేరబోతున్న రాయపాటికి నరసారావుపేట టికెట్ కేటాయించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News