: విభజన తీరు బాధించింది: పురంధేశ్వరి
విభజన బిల్లు సభలో పెట్టినప్పుడు తమను పార్లమెంట్ వెల్ లోకి వెళ్లకుండా విభజించిన తీరు చాలా బాధించిందని బీజేపీ నేత దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. దాని వల్ల తమ ప్రాంతానికి ఏర్పడే నష్టాన్ని ఎలా తీరుస్తారని అనేకసార్లు అధిష్ఠానాన్ని అడిగినా ఫలితం లేదని చెప్పారు. విజయవాడలో జరిగిన బీజేపీ ఏపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పురంధేశ్వరి మాట్లాడారు. జీవోఎం ముందు తాము పెట్టిన ప్రతిపాదనలను కూడా కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక విభజన నేపథ్యంలో (వచ్చే ఎన్నికల్లో) తెలుగువాడి పౌరుషం చూపాల్సిన అవసరం ఉందన్నారు.