: లోక్ సభ అభ్యర్థిగా చిదంబరం కుమారుడు
2014 సార్వత్రిక ఎన్నికల్లో వారసత్వ రాజకీయాలు కొనసాగుతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం కాంగ్రెస్ తరపున లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ మేరకు నిన్న (గురువారం) రాత్రి కాంగ్రెస్ విడుదల చేసిన నాలుగవ జాబితాలో కార్తీ పేరును పేర్కొంది. తమిళనాడులోని శివగంగ నుంచి బరిలోకి దిగుతున్నట్లు తెలిపింది. అన్నట్లు ఈసారి ఎన్నికల్లో చిదంబరం పోటీ చేయడంలేదు.