: కొనసాగుతున్న ఆపరేషన్ శేషాచలం


తిరుమల చుట్టూ వ్యాపించి ఉన్న శేషాచలం కొండల్లో అగ్నికీలలు క్రమంగా అదుపులోకి వస్తున్నాయి. ఈ రోజు కూడా వైమానిక హెలికాప్టర్ల సాయంతో రక్షణ సిబ్బంది మంటలను ఆర్పేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తున్నారు. కాకులకోన వైపు మంటలు నిన్న సాయంత్రానికే అదుపులోకి వచ్చేశాయి. ఈ రోజు పాపనాశనం సమీపంలోని అడవుల్లో మంటలను చల్లార్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. నేటితో కార్చిచ్చు దాదాపుగా అదుపులోకి రావచ్చని భావిస్తున్నారు. కనుచూపు మేరలో అడవి మోడువారి ఎడారిని తలపించేలా ఉండడం భక్తులను కలచివేస్తోంది. .

  • Loading...

More Telugu News