: రాష్ట్ర విభజనపై నేడు జీవోఎం భేటీ
నేడు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) భేటీ అవుతోంది. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి షిండే అధ్యక్షత వహించనున్నారు. ఇప్పటిదాకా రాష్ట్ర విభజన ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు పురోగతి సాధించిందనే విషయాన్ని... ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. భేటీలో చర్చించిన అంశాలను ప్రధాని మన్మోహన్, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీకి వివరిస్తారు.