: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అరెస్టు


అనంతపురం జిల్లా రాయదుర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారని ఆయనపై కేసు నమోదు చేశారు. జగన్, రామచంద్రారెడ్డి ఫోటోలున్న 680 గోడ గడియారాలను రాయదుర్గం తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. నిన్న బళ్లారిలోని ఆయన నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. చీరలు, కుక్కర్లు, క్రికెట్ సామాగ్రి, 43 లక్షల విలువైన చెక్కులను స్వాధీనం చేసుకున్నారు. దీంతో బళ్లారిలోని రూరల్ పోలీస్ స్టేషన్ లోను ఆయనపై కేసు నమోదయ్యింది.

  • Loading...

More Telugu News