: కేసీఆర్ పై మధు యాష్కీ ఫైర్
టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమకారుల రక్తం కళ్ళజూసిన కొండా సురేఖ దంపతులను టీఆర్ఎస్ లో ఎలా చేర్చుకున్నారని మండిపడ్డారు. రాజ్యాధికారం కోసమే కేసీఆర్ తాపత్రయపడుతున్నారని, అందుకే, తెలంగాణ వ్యతిరేకులను పార్టీలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. రాజకీయలబ్ది కోసమే ఉద్యోగుల ఆప్షన్లు, నదీజలాల అంశాన్ని ప్రస్తావిస్తున్నారని దుయ్యబట్టారు.