: కారు నుంచి కోటీ 80 లక్షలు స్వాధీనం
ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నగదు పట్టుబడుతోంది. తాజాగా అనంతపురం జిల్లా టీవీ టవర్ సమీపంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కారులో తరలిస్తున్న కోటీ 80 లక్షల రూపాయలను పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన మొత్తం ఐసీఐసీఐ బ్యాంకుకు చెందినదిగా కారులోని వ్యక్తులు చెబుతున్నారు. కాగా అందుకు సంబంధించిన ఆధారాలు వారి వద్ద లేవని అధికారులు చెబుతున్నారు.