: పోలీస్ స్టేషన్ పై విరుచుకుపడిన తాలిబాన్లు


ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు మరోమారు పేట్రేగిపోయారు. ఈ ఉదయం జలాలాబాద్ పట్టణంలోని ఓ పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. ఈ ఘటనలో 18 మంది మరణించారు. కారులో పేలుడు పదార్థాలతో తొలుత పోలీస్ స్టేషన్ భవనాలను ధ్వంసం చేసిన తాలిబాన్లు అనంతరం కాల్పులకు దిగారు. ఈ దాడిలో ఐదుగురి కంటే ఎక్కువమంది మిలిటెంట్లు పాల్గొన్నారని అధికారులు తెలిపారు. కాగా, పేలుడు ధాటికి పోలీస్ స్టేషన్ భవనాలేకాక, ఆ పక్కనే ఉన్న జాతీయ టీవీ కార్యాలయం భవంతి కూడా దెబ్బతిన్నది.

  • Loading...

More Telugu News