: వేసవికి ప్రత్యేక రైళ్ళను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
దక్షిణ మధ్య రైల్వే ఈ వేసవికి 118 ప్రత్యేక రైళ్ళను ప్రకటించింది. ఈ రైళ్ళు సికింద్రాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు నడపనున్నారు. డిమాండ్ దృష్ట్యా సికింద్రాబాద్ నుంచి విశాఖకు 26 ఏసీ రైళ్ళను నడపాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. ఇక సికింద్రాబాద్-మచిలీపట్నం మధ్య 16 రైళ్ళు, సికింద్రాబాద్-ముంబయి మధ్య 26 ఏసీ రైళ్ళు , హైదరాబాద్-రేణిగుంట మధ్య 18 రైళ్ళను, గుంటూరు-తిరుపతి మధ్య 18 రైళ్ళను, తిరుపతి-ఔరంగాబాద్ నడుమ 14 రైళ్ళను నడపుతామని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది.