: తెలంగాణలో మరో తిరుగుబాటు తప్పదు!: వరవరరావు


తెలంగాణ ఉద్యమం మరోసారి పురుడు పోసుకునే అవకాశం ఉందని అన్నారు. మళ్లీ తిరుగుబాటు చేయాల్సిన అవసరం, విద్యార్థులు కీలకపాత్ర పోషించాల్సిన అవసరం ఏర్పడుతుందని విప్లవ రచయితల సంఘం(విరసం) నేత వరవరరావు అభిప్రాయపడ్డారు. హన్మకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ సాహిత్య చరిత్ర-పునర్నిర్మాణం అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, 'నాడు మానుకోటలో రాళ్లతో కొట్టారు. నేడు పూలదండలు వేసి పార్టీలోకి చేర్చుకున్నార'ని ఎద్దేవా చేశారు.

'టీఆర్ఎస్ లోకి రావడం వల్ల కొండా దంపతులకు పవిత్రత చేకూరిందా? లేక వారు రావడం వల్ల పార్టీకి పవిత్రత చేకూరిందా?' అని వరవరరావు టీఆర్ఎస్ ను ప్రశ్నించారు. తెలంగాణ పునర్నిర్మాణం అన్న టీఆర్ఎస్ తమ లక్ష్యసాధన మరచి ఓట్లు, సీట్ల వ్యవహారంలో తలమునకలైందని ఎద్దేవా చేశారు. భౌగోళికంగా తెలంగాణ సాధించినప్పటికీ 3 లక్షల మంది ఆదివాసీల ప్రయోజనాలను పోలవరం కోసం పణంగా పెట్టాల్సి రావడం సరైన చర్యకాదన్నారు.

  • Loading...

More Telugu News