: కీలక నేతలు టీఆర్ఎస్ లో చేరనున్నారు: హరీష్ రావు
రెండు, మూడు రోజుల్లో పలువురు కీలక నేతలు టీఆర్ఎస్ లో చేరనున్నారని ఆ పార్టీ నేత హరీష్ రావు తెలిపారు. వివిధ పార్టీల నేతలు తమతో టచ్ లో ఉన్నారని చెప్పారు. అయితే, పార్టీకి అవసరమైన వారిని మాత్రమే చేర్చుకుంటామని చెప్పారు. సాధారణ ఎన్నికల్లో పొత్తులపై చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో సీపీఐతో కలసి పని చేస్తామని... సీపీఎంతో జతకట్టమని స్పష్టం చేశారు.