: గూగుల్ లో మోడీ కోసం శోధన
ఇంటర్నెట్ ప్రపంచంలోనూ మోడీ హవా నడుస్తోంది. ఎక్కువ మంది సమాచారం కోసం శోధిస్తున్న ముఖ్యమంత్రిగా దేశంలో నరేంద్రమోడీయే ప్రథమ స్థానంలో ఉన్నారట. గూగుల్ ట్రెండ్స్ ప్రకారం.. ప్రథమ స్థానంలో మోడీ ఉండగా.. తమిళనాడు సీఎం జయలలిత, యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్, పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ, బీహార్ సీఎం నితీశ్ కుమార్ వరుసగా మోడీ వెనుక ఉన్నారు. ఎక్కువ మంది సమాచారం కోసం వెతుకుతున్న సీఎంల జాబితాలో వీరితోపాటు శివరాజ్ సింగ్ చౌహాన్ (మధ్యప్రదేశ్), వసుంధరరాజె (రాజస్థాన్), తరుణ్ గగోయ్ (అసోం), ఒమర్ అబ్దుల్లా (జమ్మూకాశ్మీర్), ఊమెన్ చాందీ (కేరళ) కూడా ఉన్నారని గూగుల్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఎన్నికల నేపథ్యంలో డిసెంబర్ 14 నుంచి మార్చి 13 వరకు డేటాను విశ్లేషించి గూగుల్ ఈ వివరాలు వెల్లడించింది.