: శేషాచలం కొండల దహనంపై దర్యాప్తు జరిపించాలి: స్వామి స్వరూపానందేంద్ర
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల చుట్టూ వ్యాపించి ఉన్న విలువైన అటవీ సంపద అంతా తగలబడి పోతుంటే అధికారులు సకాలంలో స్పందించలేకపోయారని విశాఖ శారదాపీఠం అధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. నెలకోసారి తిరుమలను దర్శించుకునే రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కూడా వెంటనే చర్యలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా మంటలను వెంటనే అదుపుచేయడానికి పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే శేషాచలం అడవుల్లో అగ్ని కీలలకు కారణాలను గుర్తించడానికి సీబీఐతో దర్యాప్తు జరిపించాలని స్వామి డిమాండ్ చేశారు. మంటలు రేగడం వెనుక ఎర్రచందనం స్మగర్ల హస్తం ఉందా లేక అన్యమతస్తులెవరైనా దీనికి పాల్పడ్డారా అన్నది విచారణ ద్వారా తేల్చాలన్నారు.