: అదుపులోకి వస్తున్న మంటలు
తిరుమల చుట్టూ ఉన్న శేషాచలం కొండల్లో చెలరేగిన మంటలు అదుపులోకి వస్తున్నాయి. పాపవినాశనానికి 4 కిలోమీటర్ల దూరంలో వ్యాపించిన మంటలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అగ్నిమాపక డీజీ సాంబశివరావు తిరుమల చేరుకుని ఏరియల్ సర్వే నిర్వహించారు. కాకులమాను కొండ వద్ద మంటలు పూర్తిగా చల్లారాయి. తుంబుర తీర్థం వైపు మంటలు ఉన్నట్టు గుర్తించిన అధికారులు వాటిని ఆర్పేందుకు చర్యలు చేపట్టారు. రెండు హెలికాప్టర్ల ద్వారా నీరు, రసాయనాలతో మంటలు ఆర్పేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. పాపవినాశనం మార్గంలో భక్తుల రాకపోకలను నియంత్రించారు. అక్కడి దుకాణాలన్నీ మూసివేసి దుకాణదారులను తిరుమలకు తరలించారు.