: ఒబామా అంతటివాడికీ ఒంటరితనం తప్పలేదు!


అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్యాబిడ్డల పట్ల ఎంత ఆపేక్ష ప్రదర్శిస్తాడో ఈ విషయం వింటే స్పష్టమవుతుంది. అర్ధాంగి మిచెల్లీ, పిల్లలు సాషా, మలియా చైనా పర్యటనకు వెళ్ళారట. ఎప్పుడూ సందడి నెలకొని ఉండే ఇల్లు ఆ ముగ్గురూ లేకపోవడంతో బోసిపోయిందని ఒబామా నిట్టూర్పు విడిచారు. ఒంటరితనం ఫీలవుతున్నానని తెలిపారు. అందుకు విరుగుడుగా ఆయన ఏంచేయదలుచుకున్నారో చూడండి! ఈ వారాంతంలో 'సీజర్ చావెజ్: యాన్ అమెరికన్ హర్' అనే హాలీవుడ్ సినిమా చూడనున్నారు.

'మిచెల్లీతో పాటు పిల్లలు కూడా చైనా వెళ్ళారు. ఒంటరితనం బాధించే ఇలాంటి సమయాల్లో ఉత్తేజభరితమైన సినిమాకు వెళ్ళడంకంటే మంచి మార్గం ఇంకేముంటుంది?' అని ఒబామా పేర్కొన్నారు. ఈ సినిమా స్క్రీనింగుకి సంబంధించి అధ్యక్షభవనం ఏర్పాట్లు చేస్తోంది.

  • Loading...

More Telugu News