: పవన్ కల్యాణ్ గురించి తెలియదు... సినిమా వాళ్లను ప్రజలు ఆదరించరు: జేసీ
సినీ నటుడు పవన్ కల్యాణ్ గురించి తనకు తెలియదని కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ, సినిమావాళ్లు రాజకీయాల్లో రాణిస్తారనే అంచనాలు ప్రజల్లో లేవని అన్నారు. సినిమా వాళ్లు రంభ, మేనకల్లా ఉంటారని, వారిని చూసేందుకు జనాలు తాపత్రయపడతారే తప్ప వారేవో అద్భుతాలు చేస్తారనే భ్రమలు ప్రజల్లో లేవని ఆయన తెలిపారు.
సినిమా వాళ్లు స్క్రిప్టు ప్రకారం నటిస్తారని, రాజకీయాల్లో స్క్రిప్టులు ఉండవని, ప్రజలకు అనుగుణంగా పని చేయాల్సి ఉంటుందని జేసీ స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ గురించి తనకు ఏమీ తెలియదని, పార్టీ ఎవరైనా పెట్టొచ్చు కనుక అతని పార్టీ ఏం చేస్తుందో చూడాలని జేసీ అన్నారు.