: సీఎం బిజీ.. బాబ్లీపై అఖిలపక్షం వాయిదా


బాబ్లీ ప్రాజక్టు అంశం పై జరగాల్సిన అఖిలపక్ష భేటీ వాయిదా పడింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శాసనసభ సమావేశాల్లో ఉండటం వాయిదా కు కారణమైంది. ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోవడంతో విపక్షాలు భేటీని వాయిదావేయాలని కోరాయి. దీంతో మంత్రి సుదర్శన్ రెడ్డి అఖిలపక్ష సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. సీఎం తో చర్చించి రెండు మూడు రోజుల్లో తేదీ నిర్ణయిస్తామని మంత్రి వెల్లడించారు. కాగా, బాబ్లీ అంశం పై సుప్రీం ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం అప్పీల్ చేయాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి.  

  • Loading...

More Telugu News