: చెన్నై మ్యాచ్ ల్లో లంక ఆటగాళ్ళు పాల్గొనరు: శుక్లా


షెడ్యూల్ ప్రకారం చెన్నైలో జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ ల నిర్వహణలో మార్పేమీలేదని తెలిపిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ రాజీవ్ శుక్లా చావు కబురు చల్లగా చెప్పారు. ఆ మ్యాచ్ లలో లంక ఆటగాళ్ళు పాల్గొనరని స్పష్టం చేశారు. శ్రీలంక తమిళుల సమస్య ఇంకా చల్లారని నేపథ్యంలో స్థానిక ప్రభుత్వాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని ఆయన చెప్పారు. లంక ఆటగాళ్ళను చెన్నై వేదికగా జరిగే మ్యాచ్ ల్లో ఆడించవద్దని 9 ఫ్రాంచైజీలకూ సూచించామని శుక్లా అన్నారు. 

  • Loading...

More Telugu News