: ఆర్ధిక కేంద్రాల జాబితాలో 66వ స్థానానికి పడిపోయిన ముంబై


దేశ ఆర్ధిక రాజధాని ముంబై 'ప్రపంచ ఆర్ధిక కేంద్రాల' (జీఎఫ్ సీఐ) తాజా జాబితాలో 66వ స్థానానికి పడిపోయింది. గత ఏడాది 63వ స్థానంలో ఉన్న ముంబై మూడు స్థానాలు దిగజారింది. అయితే జాబితాలో దేశ రాజధాని న్యూఢిల్లీ మాత్రం ఎలాంటి ప్రభావం చూపలేకపోవడం గమనార్హం. మొత్తం 79 ఆర్ధిక కేంద్రాల ప్రొఫైళ్లు, వాటి రేటింగు, స్థానాల కొత్త జాబితాను మంగళవారం జీఎఫ్ సీఐ విడుదల చేసింది.

ఇందులో లండన్ మొదటిస్థానంలో
 నిలవగా భారత్ నుంచి ముంబై ఒక్కటే స్థానం సంపాదించుకోవటం విశేషం. కాగా, న్యూయార్క్ సిటీ రెండవ స్థానం.. హాంగ్ కాంగ్, సింగపూర్ లు మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఇక జాబితాలో వరుసగా జురిచ్ (5వ స్థానం), టోక్యో (6వ స్థానం), జెనీవా (7వ స్థానం), బోస్టన్ (8వ స్థానం), సియోల్ (9వ స్థానం), ఫ్రాంక్ ఫర్ట్ (10వ స్థానం) ఉన్నాయి.


  • Loading...

More Telugu News