: కాలినడకన వచ్చే భక్తులను అలిపిరి వద్ద ఆపేశారు
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులను టీటీడీ అధికారులు అలిపిరి వద్ద ఆపివేశారు. తిరుమల శేషాచల కొండల్లో భారీ అగ్నిప్రమాదం జరగడంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. కార్చిచ్చుతో తిరుమల కొండల్లోని అటవీ ప్రాంతంలో మంటలు ఎగసిపడుతున్నాయి. ఫైరింజన్లతో ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాని సంగతి తెలిసిందే.