: నేనెప్పుడూ లోక్ సభ టికెట్ అడగలేదు: పొన్నాల
లోక్ సభ టికెట్ తానెప్పుడూ అడగలేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఆ టికెట్ కు దరఖాస్తు కూడా చేయలేదని చెప్పారు. టీఆర్ఎస్ ను రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తున్నామన్నారు. కాంగ్రెస్ తో ఎవరైనా కలసి వస్తానంటే స్వాగతిస్తామన్న పొన్నాల, అన్ని స్థాయిల నివేదికలతోనే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని చెప్పారు. గెలుపే ప్రాతిపదికగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని, సిట్టింగులకే తొలి ప్రాధాన్యత అని వివరించారు. ఈ నెల 28 నాటికి అభ్యర్థుల ప్రకటన చేస్తామన్నారు. బడుగు, బలహీన వర్గాలకు, మహిళలు, యువతకు సముచిత ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.