: పట్టుబడిన రూ.33 లక్షలను ఐటీ అధికారులకు అప్పగించాం: బెల్లంపల్లి డీఎస్పీ
ఆదిలాబాదు జిల్లాలో పోలీసులు జరిపిన వాహన తనిఖీల్లో మంగళవారం నాడు రూ. 33 లక్షల నగదు పట్టుబడింది. రెబ్బన మండలంలోని గోలేటి సెంటర్ వద్ద పోలీసులు, రెవెన్యూ అధికారులు జరిపిన తనిఖీల్లో... బెల్లంపల్లి నుంచి ఆసిఫాబాదుకు కారులో తరలిస్తున్న రూ. 33 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బెల్లంపల్లి డీఎస్పీ ఈశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. బెల్లంపల్లికి చెందిన ఓ పెట్రోల్ బంక్ యజమాని రూ. 33 లక్షల నగదును కారులో తీసుకెళుతుండగా స్వాధీనం చేసుకున్నామని అన్నారు. పూర్తి స్థాయిలో పత్రాలు లేకపోవటంతో ఆ సొమ్మును ఐటీ అధికారులకు అప్పగించనున్నట్లు ఆయన తెలిపారు.