: ప్రియుణ్ణి కలవాలని భవనంపై నుంచి దూకబోయి...


థానేలో ఓ అమ్మాయి తన ప్రియుణ్ణి కలుసుకోవాలని తానుంటున్న భవనం నుంచి దూకే ప్రయత్నంలో ప్రాణాలు పోగొట్టుకుంది. వివరాల్లోకెళితే... స్థానిక కాసర్వాడి ప్రాంతంలో నివాసముండే ఈ అమ్మాయి ఇటీవలే ఇంటర్మీడియట్ పరీక్షలు రాసింది. పొరుగున ఉండే ఓ అబ్బాయితో ఈ టీనేజర్ ప్రేమలో పడింది. అయితే, ప్రియుడి ఇంటికి నేరుగా వెళితే అక్కడి సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమవుతుందని ఆమె భయపడింది. దీంతో, బాల్కనీలోంచి ప్రియుడి ఇంటి మీదికి లంఘించింది. కానీ, పట్టుతప్పి రెండు భవనాల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో పడిపోయి ప్రాణాలు విడిచింది. దీన్ని, ప్రమాదవశాత్తు సంభవించిన మరణంగా పోలీసులు నమోదు చేసుకున్నారు.

  • Loading...

More Telugu News