: టీడీపీ పద్ధతి ప్రకారం చేస్తుంది: తలసాని
ఏం చేసినా టీడీపీ పద్ధతి ప్రకారం చేస్తుందని ఆ పార్టీ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాదులోని చంద్రబాబు నాయుడు నివాసంలో ఆయన మాట్లాడుతూ, పట్వారీ, గడీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన ధీర తెలంగాణ ఇన్నాళ్లకు సాధ్యమైందని అన్నారు. తెలంగాణను అభివృద్ధి చేయాలంటే సమర్థవంతమైన నాయకత్వం ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. సమర్థవంతుడైన నేతగా చంద్రబాబు నాయుడు ఎప్పుడో పేరు గడించారని ఆయన తెలిపారు. టీడీపీ అధికారంలో ఉంటే రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతుందని ఆయన స్పష్టం చేశారు.