: టీమిండియా 'ప్రాక్టీస్' ఘనంగా ముగిసేనా?
టీ20 వరల్డ్ కప్ కు ముందు భారత్ నేడు రెండో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఇంగ్లండ్ తో జరిగే ఈ వార్మప్ మ్యాచ్ ను నెగ్గడం ద్వారా ఆత్మవిశ్వాసం కూడగట్టుకోవాలని ధోనీ సేన భావిస్తోంది. తొలి సన్నాహక మ్యాచ్ లో శ్రీలంక చేతిలో ఓటమిపాలైన భారత్ ఈ మ్యాచ్ లోనూ మరికొన్ని వనరులను పరీక్షించాలని తలపోస్తోంది. తద్వారా తొలి మ్యాచ్ లో రిజర్వ్ బెంచ్ కే పరిమితమైన ఆటగాళ్ళు ఈ పోరులో బరిలో దిగనున్నారు. కాగా, భారత్ మెయిన్ డ్రాలో తన పోరును ఎల్లుండి పాకిస్తాన్ తో మ్యాచ్ ద్వారా ఆరంభించనుంది.