: ఈసీ ఐకాన్ గా అమీర్ ఖాన్
2014 లోక్ సభ ఎన్నికల్లో తమ నేషనల్ ఐకాన్ గా ఎలక్షన్ కమిషన్ అమీర్ ఖాన్ ను ఎంచుకుంది. ఇప్పటికే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, క్రికెట్ కెప్టెన్ ధోనీ, బాక్సర్ మేరీ కోమ్, షట్లర్ సైనా నెహ్వాల్ లు నేషనల్ ఐకాన్ లుగా ఎంపికయ్యారు. వీరంతా కలసి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజల్లో చైతన్యం తీసుకొస్తారు. ఈ క్రమంలో వీరంతా ఎలక్షన్ కమిషన్ ప్రసారం చేసే ప్రకటనల్లో కనిపిస్తారు.