: మహబూబ్ నగర్ జిల్లాకు పదేళ్లు పన్ను రాయితీ: జైరాం రమేశ్
మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి జైరాం రమేశ్ అక్కడి కాంగ్రెస్ కార్యకర్తలు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వెనుకబడిన జిల్లా అయినందున మహబూబ్ నగర్ కు పదేళ్ల పాటు పన్ను రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. 2000 సెప్టెంబర్ 21నే తెలంగాణ ప్రకటన చేశామని మంత్రి చెప్పారు. ఐదారేళ్లలో తెలంగాణలో 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కృషి చేస్తామని తెలిపారు. తెలంగాణకు మద్దతుగా టీడీపీ లేఖలు ఇచ్చి ఆ తర్వాత మాట మార్చిందని విమర్శించారు.