: పర్యావరణాన్ని పరిరక్షించమంటూ ఎమ్మెల్సీ సైకిల్ యాత్ర


పర్యావరణాన్ని పరిరక్షించమంటూ ఓ ఎమ్మెల్సీ సైకిల్ యాత్ర చేపట్టారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసనమండలి సభ్యుడు ఎం.వి.ఎన్.శర్మ గత నెల 23న శ్రీకాకుళంలో ఈ సైకిల్ యాత్రను ప్రారంభించారు. ఈ సైకిల్ యాత్ర ప్రస్తుతం విశాఖ జిల్లా రావికమతం మండలానికి చేరుకుంది. మంగళవారం రాత్రి కొత్తకోటలో బస చేసిన సైకిల్ యాత్ర బృందం ఈరోజు రోలుగుంట, నర్సీపట్నం, మాకపారిపాలెం మండలాల మీదుగా కొనసాగుతోంది. ఈ నెల 26వ తేదీన ఎమ్మెల్సీ బృందం విశాఖపట్నానికి చేరుకుంటుంది.

  • Loading...

More Telugu News