: పెళ్లి కోసం సినీ నటి పూజలు
యువ హీరోలు తన వైపు చూడకపోవడం, పెద్ద హీరోలు కూడా కొత్త ముఖాల కోసం వెతుకుతుండడంతో సినీ నటి అంకిత పెళ్లి సన్నాహాల్లో పడింది. పెళ్లి సంబంధాలు కుదరట్లేదో ఏమో కానీ కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వరాలయంలో ప్రత్యేకంగా రాహుకేతు పూజలు చేయించుకుంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, తాను అమెరికాలో చదువుకుంటున్నానని, అలాగే పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నానని తెలిపింది.
శ్రీకాళహస్తీశ్వరుని ఆశీస్సులతోనైనా తనకు పెళ్లి జరుగుతుందనే ఆశతో రాహుకేతు పూజలు చేయించుకున్నానని తెలిపింది. పెళ్లి తరువాత సినిమాల్లో నటించాలా? వద్దా? అనేది తరువాత చెబుతానని అంకిత తెలిపింది. 'ఐ లవ్యూ రస్నా' అంటూ అందర్నీ అలరించిన అంకిత 'లాహిరిలాహిరిలో' సినిమాతో హీరోయిన్ గా మారిన సంగతి తెలిసిందే.