: 58 మంది లోక్ సభ అభ్యర్ధులతో కాంగ్రెస్ మూడో జాబితా


కాంగ్రెస్ పార్టీ 58 మంది లోక్ సభ అభ్యర్ధుల పేర్లతో మూడో జాబితాను నిన్న రాత్రి విడుదల చేసింది. రాజస్థాన్ లోని సవాయ్ మదోపూర్ నుంచి మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ పోటీ చేయనుండగా, చాందినీ చౌక్ నుంచి కపిల్ సిబల్, అజ్మీర్ నుంచి సచిన్ పైలట్, గుర్ గావ్ నుంచి రావ్ ధరమ్ పాల్, న్యూఢిల్లీ నుంచి అజయ్ మాకెన్ పోటీ చేయనున్నారు. ఇక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సురేశ్ కల్మాడీకి పోటీ చేసే అవకాశం దక్కలేదు. కాగా ఈ జాబితాలో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి అభ్యర్ధులను ఎవరినీ ప్రకటించలేదు.

  • Loading...

More Telugu News