: నా సామిరంగా... ఆ విమానం మాకే దొరికి ఉంటేనా!
సాంకేతిక పరిజ్ఞానానికి సవాలు విసిరిన మలేసియా విమానం మిస్సింగ్ వ్యవహారాన్ని వివిధ వర్గాలు పలు రకాల వ్యాఖ్యలతో రక్తికట్టిస్తున్నాయి. తాజాగా తాలిబాన్లు కూడా విమాన ప్రమాదంపై స్పందించారు. విమానాన్ని హైజాకర్లు తాలిబాన్ల రాజ్యమైన ఖైబర్ ఫక్తుంక్వాకో, లేక, కాందహార్ కో తీసుకెళ్లి ఉంటారని అనుమానిస్తున్న నేపథ్యంలో తాలిబాన్లు ఒక ప్రకటన చేశారు. అలాంటి విమానమేదీ తమ ప్రభావ క్షేత్రంలో లేదని, ఆ విమానానికి, తమకు ఎలాంటి సంబంధం లేదని, అలాంటి ఆపరేషన్ ఏదీ తాము చేపట్టలేదని ప్రకటనలో తాలిబాన్లు స్పష్టం చేశారు.
అంతటితో ఆగకుండా అలాంటి విమానమే గనక తమకు దొరికి ఉంటేనా.. సామిరంగా...! పరిస్థితిని సద్వినియోగం చేసుకునేవారమని అన్నారు. ఇది తమ ఏరియాలో జరగలేదంటూ, తమపై వచ్చిన ఊహాగానాలను వారు ఖండించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న దేశాలు విమానాన్ని గాలిస్తున్నాయని తాలిబాన్ కమాండర్ జబీహుల్లా ముజాహిద్ అన్నారు.