: అరుణ్ జైట్లీ పర్యటనలో ‘మోత మోగింది’


బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ పంజాబ్ పర్యటనలో ‘మోత మోగింది’. జైట్లీ రాకను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన గ్యాస్ బెలూన్లకు మంటలు అంటుకుని అవి కాస్తా పేలిపోయాయి. బాణసంచా కాల్చినప్పుడు నిప్పురవ్వలు రేగి ఎయిర్ బెలూన్లకు అంటుకోవడంతో అవి కాస్తా పేలిపోయాయి.

జైట్లీ సహా కొందరు పార్టీ నాయకులకు స్వల్పంగా కాలిన గాయాలయ్యాయి. అమృతసర్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న అరుణ్ జైట్లీకి బీజేపీ, అకాలీదళ్ నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో స్వాగతం పలికారు.

  • Loading...

More Telugu News