: ధోనీపై ఫిక్సింగ్ కథనాలు ప్రసారం చేయొద్దు: మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు
తనపై ఫిక్సింగ్ ఆరోపణలు చేసిన జీ న్యూస్ నెట్ వర్క్ పై టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మద్రాస్ హైకోర్టులో రూ.100 కోట్లకు పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి... ధోనీపై జీ న్యూస్ నెట్ వర్క్ చానళ్ళలో ఎలాంటి కథనాలు, చర్చా కార్యక్రమాలు ప్రసారం చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.