: తియ్యగా మాట్లాడుతాడు...ఎవ్వరి మాటా వినడు:అమెరికా కాన్సులేట్ అధికారి


బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై అమెరికా కాన్సులేట్ అధికారి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. మోడీ మాటలు తీయగా ఉంటాయని, ఆయన వ్యవహార శైలి సున్నితంగా ఉంటుందని, కానీ ఆయన అతి కొద్ది మంది నమ్మకస్తులైన సలహాదారుల మాటలు వింటారే తప్ప ఇతరులను నమ్మరని నిష్టూరమాడుతూ... మోడీ ఎదగడం ఖాయం కనుక అతనిని కలవడం అవసరమని, ఆయన తీసుకునే నిర్ణయాలు మంత్రి వర్గ సహచరులకు కూడా తెలియవని ట్విట్టర్లో కామెంట్ చేశారు. దీనిపై మోడీ వ్యతిరేకులు దుమ్మెత్తి పోస్తుండగా... అమెరికా సర్టిఫికేట్ అవసరం లేదని, మోడీ ఎలాంటి వాడో తమకు తెలుసని బీజేపీ నేతలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News