: సందట్లో సడేమియాలా జారుకున్న ఖైదీలు


జైలు సిబ్బంది, ఖైదీల మధ్య ఘర్షణను ఆసరాగా చేసుకున్న నలుగురు ఖైదీలు చల్లగా జారుకున్న ఘటన బీహార్ లో చోటుచేసుకుంది. బీహార్ సీతామర్హి జిల్లా జైలులో ఆహారంలో నాణ్యత లేదంటూ ఖైదీలు నిరసనకు దిగారు. దీంతో జైలు సిబ్బందికి, ఖైదీలకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో పలువురు ఖైదీలు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో జైలు సిబ్బంది వారికి వైద్యసహాయం అందిచడంలో తలమునకలై ఉండగా సందట్లో సడేమియాలా నలుగురు విచారణ ఖైదీలు పరారయ్యారు. వీరిని సడ్రి అలాం, సుబోధ్ కుమార్, సూరజ్ కుమార్, వినయ్ బైతాలుగా గుర్తించినట్టు జైలు సూపరింటెండెంట్ తెలిపారు.

  • Loading...

More Telugu News