: పవన్ పార్టీ వెనుక చంద్రబాబు ఉన్నాడు: వీహెచ్
పవన్ కల్యాణ్ కొత్త పార్టీ ‘జనసేన’ వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నాడని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆరోపించారు. ఎన్నికల్లో టీడీపీ తరపున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయనని చెప్పటంతోనే... పవన్ కల్యాణ్ ను బాబు తెర మీదకు తెచ్చారని ఆయన అన్నారు. హైదరాబాదులో ఈరోజు (మంగళవారం) ఆయన మీడియాతో మాట్లాడుతూ... పవన్ ఇమేజ్ ను చంద్రబాబు వాడుకోవాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. పవన్ సినిమా డైలాగులతోనే కాంగ్రెస్ భూస్థాపితం కాదని వీహెచ్ అన్నారు. కాంగ్రెస్ లోనే బీసీలకు సముచిత స్థానం లభిస్తుందని వీహెచ్ తేల్చి చెప్పారు.