: ఇంతకంటే అమానుషం ఉంటుందా?


పాకిస్తాన్ లో మానవత్వం ఇంకా సుప్తావస్థలోనే ఉందనడానికి ఇదో ప్రబల దృష్టాంతం. తాజాగా చోటుచేసుకున్న ఓ దారుణం అక్కడి అమానవీయతను కళ్ళకు కడుతోంది. ఓ వ్యక్తి తాను ప్రేమించిన అమ్మాయితో వెళ్ళిపోగా... అతని సోదరిపై సామూహిక అత్యాచారం చేశారు అమ్మాయి తరపు బంధువులు. వివరాల్లోకెళితే...

చినియోట్ జిల్లాలో సనావుల్లా (22) అనే యువకుడు మల్లాహ్ కులానికి చెందిన యువతిని ప్రేమించాడు. వారి పెళ్ళికి ఇరువర్గాలు నిరాకరించాయి. దీంతో, వారిద్దరూ ఊరు వదిలి వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ పెట్టించారు సనావుల్లా ప్రియురాలి కుటుంబ సభ్యులు. జరిగిన నష్టానికి ప్రతిగా, సనావుల్లా సోదరి... ప్రియురాలి సోదరుడు జాహిద్ అలీని పెళ్ళి చేసుకోవాలని తీర్మానించారు.

ఈ తీర్పు ఇలా ఉండగానే, జాహిద్ మిత్రుడొకరు సనావుల్లా సోదరిని కిడ్నాప్ చేసి నిఖా చేసుకున్నాడు. అదీ ఐదు రోజుల తర్వాత విడాకులు ఇచ్చేలా ఈ నిఖా జరిపించుకున్నాడు. అనంతరం ఆమెకు జాహిద్ అలీకి సోదరుడి వరసయ్యే నూర్ అహ్మద్ తో పెళ్ళి చేశారు. కొన్ని రోజుల తర్వాత ఆ యువతిపై జాహిద్ అలీ కుటుంబ సభ్యులు హేయమైన రీతిలో సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. అంతేగాకుండా, బట్టలూడదీసి ఆమెను ఓ చెట్టుకు కట్టేసి... సనావుల్లా తీసుకెళ్ళిన తమ అమ్మాయిని తిరిగి తమ వద్దకు పంపితేనే ఆమెను వదిలేస్తామని హెచ్చరించారు. దీనిపై సనావుల్లా కుటుంబ సభ్యులు మేజిస్ట్రేట్ కు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News