: సాయంత్రం టీఆర్ఎస్ లో చేరుతున్నాం: కొండా సురేఖ
తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించింది కేవలం కేసీఆర్ మాత్రమే అని కొండా సురేఖ తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణం టీఆర్ఎస్ తోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు. తెలంగాణలో బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం కేసీఆర్ పాటుపడుతున్నారని చెప్పారు. ఇవన్నీ నచ్చడం వల్లే టీఆర్ఎస్ లో తాను, తన భర్త మురళి బేషరతుగా చేరుతున్నామని తెలిపారు. సాయంత్ర 4 గంటలకు కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరుతామని స్పష్టం చేశారు. బంగారు తెలంగాణ బలమైన నాయకత్వంతోనే సాధ్యమని సురేఖ చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణం కోసం సైనికుల్లా పని చేస్తామని తెలిపారు.