: కేపీ కోరిక తీరింది!
ఐపీఎల్ తాజా సీజన్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ కు నాయకత్వం వహించాలని ఉందని ఇటీవల తన మనసులో మాట బయటపెట్టిన స్టార్ బ్యాట్స్ మన్ కెవిన్ పీటర్సన్ ఇప్పుడు ఉబ్బితబ్బిబ్బవుతున్నాడేమో! ఐపీఎల్-7లో పాల్గొనే డేర్ డెవిల్స్ జట్టుకు కేపీని సారథిగా నియమిస్తూ ఢిల్లీ ఫ్రాంచైజీ ప్రకటన చేసింది. వికెట్ కీపింగ్ బ్యాట్స్ మన్ దినేశ్ కార్తీక్ ను వైస్ కెప్టెన్ గా నియమించారు.
కేపీని వేలంలో ఢిల్లీ ఫ్రాంచైజీ రూ.9 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఇంగ్లండ్ జట్టు నుంచి అవమానకరరీతిలో వైదొలిగిన ఈ దక్షిణాఫ్రికా జాతీయుడు ఐపీఎల్ తాజా సీజన్ కు పూర్తి సమయం అందుబాటులో ఉంటాడు. కాగా, ఈ నియామకంపై డెవిల్స్ కోచ్ గ్యారీ కిర్ స్టెన్ మాట్లాడుతూ, పీటర్సన్ తో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నానని పేర్కొన్నాడు. సీజన్ ముగిసేంతవరకు కేపీ అందుబాటులో ఉండడం సంతోషదాయకమని, ఇది జట్టుపై తప్పక ప్రభావం చూపిస్తుందని తెలిపాడు.