: పొడి రంగులు చల్లుకోండి..!: ఫ్యాన్స్ కు బిగ్ బి సందేశం


హోలీ పర్వదినం సందర్భంగా పొడి రంగులు మాత్రమే చల్లుకోవాలంటున్నాడు బిగ్ బి అమితాబ్ బచ్చన్. ప్రస్తుతం మహారాష్ట్రలో కనీవినీ ఎరుగని రీతిలో నీటి కరవు తాండవిస్తున్న నేపథ్యంలో నీటిని పొదుపు చేయాలని అభిమానులకు పిలుపునిచ్చాడు. ఈమేరకు ట్విట్టర్లో స్పందించాడు. 'మార్చి కూడా ముగియలేదు, అప్పుడే మహారాష్ట్రలో నీటి ఎద్దడి. ఇక వేసవిలో ఎలా ఉంటుందో!? నీటిని సంరక్షించండి, పొడి రంగులతో హోలీ జరుపుకోండి' అని ఫ్యాన్స్ కు సూచించాడు.

గత 40 ఏళ్ళలో ఎన్నడూ మహారాష్ట్ర ఇంతటి తీవ్ర దుర్భిక్షాన్ని చవిచూడలేదని బిగ్ బి అభిప్రాయపడ్డాడు. కాగా, బాలీవుడ్ హీరోలు హృతిక్ రోషన్, రితేశ్ దేశ్ ముఖ్ లు కూడా  రేపటి హోలీలో పొడి రంగులు చల్లుకోవాలని మహారాష్ట్ర ప్రజలకు సూచించారు. 

  • Loading...

More Telugu News