: కేసీఆర్ తో కొండా సురేఖ దంపతుల భేటీ
కొండా దంపతులు టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కొండా మురళీ, సురేఖ దంపతులు భేటీ అయ్యారు. వీరిద్దరూ కాంగ్రెస్ ను వదిలి టీఆర్ఎస్ లో చేరడం ఖాయమని, అధికారికంగా ప్రకటించడమే మిగిలిందని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. కాగా, సురేఖకు వరంగల్ తూర్పు అసెంబ్లీ సీటును కేసీఆర్ ఆఫర్ చేశారని సమాచారం.