: ముద్దుగుమ్మల సొంత ప్రొడక్షన్ కంపెనీలు!


నేటితరం నటులకు ముందుచూపు ఎక్కువ. అందునా కథానాయికలకు మరికొంత ఎక్కువ. స్టార్ హోదా ఉన్నప్పుడు సంపాదించిన దాంతో తర్వాత కాలంలో సొంత ప్రొడక్షన్ కంపెనీలు పెడుతున్నారు. తమ అభిరుచి మేరకు సినిమాలు నిర్మిస్తున్నారు. బాలీవుడ్ లో ప్రస్తుతం ఇదే హవా నడుస్తోంది. జూహీచావ్లా, ప్రీతి జింటా, దియామిర్జా, శిల్పాశెట్టి ఈ బాటలోనే నడుస్తున్నారు.

ముందు జూహీ గురించి చెప్పుకుంటే, నటుడు షారుక్ ఖాన్, మరో దర్శకుడు అజీజ్ మిర్జాతో కలసి డితో డ్రీమ్జ్ అన్ లిమిటెడ్ అనే సొంత సంస్థను స్థాపించారు. ఈ బ్యానర్ పై 2000 సంవత్సరంలో షారుక్, జూహీ జంటగా 'ఫిర్ భీ దిల్ హే హిందుస్థానీ' చిత్రం తెరకెక్కించారు. తొలి ప్రయత్నం విఫలం కావడంతో తర్వాత అటువైపే చూడలేదు. అందాల భామ ప్రీతి జింటా ఐపీఎల్ తో పూర్తి బీజీగా ఉండటంతో నటనకు దూరమైంది. ఇటీవల కాలంలో నిర్మాతగా మారి 'ఇష్క్ ఇన్ పారిస్' చిత్రంను తెరకెక్కించి చేతులు కాల్చుకుంది.

ఇక దియామిర్జా విషయానికొస్తే, నటుడు జాయెద్ ఖాన్ తో కలసి 'హనీమూన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్' పేరుతో ప్రొడక్షన్ హౌస్ ను నెలకొల్పింది. తొలి ప్రయత్నంగా వారిద్దరూ కలసి నటిస్తూ, 2011లో తీసిన 'లవ్, బ్రేకప్స్, జిందగీ' అంతగా ఆకట్టుకోలేక పోయింది. ప్రస్తుతం దియా ఒక్కతే 'బాబీ జాసూస్' పేరుతో అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ఈ సినిమాలో విద్యా బాలన్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టి కూడా నిర్మాణంపై మోజుపడి నిర్మాతగా మారి తొలిసారి నిర్మిస్తున్న చిత్రం 'ఢిష్కియాన్'. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. సుస్మితా సేన్, లారాదత్తా, అమీషా పటేల్ లు కూడా ఒక్కో చిత్రం నిర్మించి అక్కడే ఆగిపోతున్నారు.

  • Loading...

More Telugu News