: 3200 ఏళ్ళనాటి అస్థిపంజరంలో క్యాన్సర్ ఆనవాళ్ళు


క్యాన్సర్ ఆనవాళ్ళున్న 3200 ఏళ్ళనాటి అస్థిపంజరం డర్హం వర్శిటీ పురాతత్వ విభాగం తవ్వకాల్లో బయటపడింది. సూడాన్ లోని నైలు నది తీర ప్రాంతంలో ఓ సమాధిలో ఈ అస్థిపంజరం వెలుగుచూసింది. కాగా, ఈ అస్థిపంజరం 25-35 ఏళ్ళ వయసున్న వ్యక్తిది అయి ఉంటుందని పరిశోధకులు అంచనా వేశారు. దీనికి సంబంధించిన ఎముకల్లో క్యాన్సర్ కణజాలం కనిపించింది. ఈ సమాచారం ఆధారంగా క్యాన్సర్ గురించి మనకు ఇప్పటివరకు తెలియని చరిత్రను ఆవిష్కరించడం సాధ్యమవుతుందని మైకేలా బౌండర్ అనే పురాతత్వ శాస్త్ర విద్యార్థి పేర్కొన్నాడు. అస్థిపంజరాన్ని కనుగొన్నది బౌండరే.

  • Loading...

More Telugu News