: క్రికెట్ పిచ్ పై అసభ్య చిత్రాలు గీశాడు... సస్పెండ్ అయ్యాడు!
ఇదేం వెర్రో గానీ, హాయిగా క్రికెట్ ఆడుకోవాల్సింది పోయి, మ్యాచ్ కోసం సిద్ధం చేసిన పిచ్ పై అసభ్య చిత్రాలు గీశాడా క్రికెటర్. ఆనక సస్పెండ్ అయ్యాడు. ఆస్ట్రేలియాలో జరిగిందీ ఘటన. గత శుక్రవారం సిడ్నీ మైదానంలో దక్షిణ ఆస్ట్రేలియా, విక్టోరియా జట్ల మధ్య ఫ్యూచర్స్ కప్ లీగ్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ సందర్భంగా దక్షిణ ఆస్ట్రేలియా పేసర్ డానియెల్ వోరెల్ మరో మ్యాచ్ కోసం తయారుచేసిన పిచ్ పై పురుషాంగం, వృషణాల బొమ్మలు గీశాడు.
దీనిపై దక్షిణ ఆస్ట్రేలియా క్రికెట్ సంఘం తీవ్రంగా స్పందించింది. ఘటనపై విచారణ జరిపి వోరెల్ పై నాలుగు సస్పెన్షన్ పాయింట్లను జరిమానాగా విధించింది. దీంతో, రెండు నాలుగు రోజుల మ్యాచ్ లకు గానీ, లేక, నాలుగు వన్డేలుగానీ, నాలుగు టీ20లకు గానీ అతడు అనర్హుడవుతాడు.