: ముంబైలో మరో మహిళా జర్నలిస్టుపై లైంగిక దాడి


దేశ ఆర్ధిక రాజధాని ముంబైలోని శక్తిమిల్స్ ఆవరణలో ఓ మహిళా జర్నలిస్టుపై తొమ్మిది నెలల క్రితం జరిగిన సామూహిక అత్యాచార ఘటనలో తీర్పు ఈ నెలలోనే వెలువడనుంది. అంతలోనే మరో మహిళా జర్నలిస్టు పట్ల ముంబైలో కామం నెత్తికెక్కిన పోకిరీలు అసభ్యకరంగా ప్రవర్తించారు. ఓ టీవీ చానల్ జర్నలిస్టు నిన్న ముంబైలోని జుహూ ప్రాంతంలో జరిగిన హోలీ వేడుకలను కవర్ చేసి తిరిగి కారులో వెళుతోంది. దారిలో కొందరు హోలీ ఆడుతూ ఆమె కారును అడ్డగించారు. డ్రైవర్ తప్పుకోవాలని కోరగా.. వారు రెచ్చిపోయారు. చుట్టూ చేరి ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగికంగా వేధించారు. రౌడీ మూకలు తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని, కొట్టారని అనంతరం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇద్దరు మైనర్లు సహా నలుగురిని అరెస్ట్ చేశామని డీసీపీ మహేశ్ పాటిల్ తెలిపారు. ఆమెను వేధించిన బృందంలోని మరో 30 మంది కోసం గాలిస్తున్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News