: 2015 వరల్డ్ కప్పే ఆఖరు: సంగక్కర
టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన మరుసటి రోజే శ్రీలంక స్టార్ బ్యాట్స్ మెన్ సంగక్కర వన్డేలకు కూడా వీడ్కోలు పలుకుతున్నానని చెప్పాడు. 2015లో జరగబోయే ప్రపంచ కప్పే తనకు ఆఖరిదని ప్రకటించాడు. వరల్డ్ కప్ తర్వాత వన్డేలకు గుడ్ బై చెబుతానని... టెస్టుల్లో మాత్రం కొనసాగుతానని స్పష్టం చేశారు. వన్డేలు, టెస్టులకు సమంగా సమయం కేటాయించలేకపోతున్నానని ఈ సందర్భంగా సంగ చెప్పాడు.